Header Banner

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

  Sun May 04, 2025 10:54        Politics

రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్ తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ, యునిసెఫ్ యువాహ్ ప్రతినిధులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యునిసెఫ్,  ఏపీఎస్ఎస్ డీసీ పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI), యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) కార్యక్రమాలను అమలుచేయనున్నారు. ఇంటికో వ్యాపారవేత్త, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయి. యువతలో నవీన ఆవిష్కరణలు, ఇంక్లూజన్, స్థిర జీవనోపాధి అవకాశాలను పెంపొందించనున్నాయి. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI) ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు యూనిసెఫ్ గ్లోబల్ UPSHIFT ఫ్రేమ్‌వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.

 

ఇది కూడా చదవండి: అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

యూత్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానించిన బహుభాషా డిజిటల్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, వాలంటీర్‌షిప్ అవకాశాలను కల్పిస్తారు. పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) కార్యక్రమం ద్వారా 15 నుంచి 29 సంవత్సరాల మధ్యగల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్, ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, యునిసెఫ్ ఏపీ, కర్ణాటక, తెలంగాణ ఫీల్డ్ ఆఫీస్ సీఎఫ్ వో జిలాలిమ్ బిర్హాను టఫెస్సే, ఫీల్డ్ ఆఫీస్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీకృష్ణ మదమంచి, యూనిసెఫ్ ఇండియా అడాలసెంట్ అండ్ యూత్ డెవలప్ మెంట్ స్పెషలిస్ట్ మానస ప్రియా వాసుదేవన్, స్టాక్ హోల్మ్ డిజిటల్, ఏఐ, స్ట్రాటజీ, ఆఫీస్ ఆఫ్ ఇన్నోవేషన్ కన్సల్ టెంట్ రవితేజ బాలే, ఏపీ కర్ణాటక, తెలంగాణ యునిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ ఇన్నోవేషన్ కన్సల్ టెంట్స్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting